మల్టీప్లెక్స్ లపై కొరడా ఝలిపిన సర్కార్

ఆహార పదార్థాల అమ్మకాల విషయంలో మల్టీప్లెక్స్ లపై కొరడా ఝలిపించింది సర్కార్. ఆహార పదార్థాల అమ్మకాల్లో దోపిడీ ఇక చెల్లదని, అలా అమ్మినవారిపై కఠినచర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. లీగల్ మిట్రాలజీ యాక్ట్  2009 ప్రకారం మల్టీప్లెక్స్ ల నిర్వాహకులు ప్రభుత్వం ప్రకటించిన వధివిధానాలను కచ్చితంగా పాటించాలి. సెక్షన్-ప్రకారం ప్రతి వస్తవు బరువు, దాని పరిమాణం ప్యాకింగ్ పై కచ్చితంగా ముద్రించాలి.

 

దీనిని పాటించని కారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి అదే తప్పు చేసి దొరికితే ఆరు నెలలు జైలు శిక్షతోపాటు జరిమానా.

*సెక్షన్ -18(1) ప్రకారం నాణ్యత సరిగాలేని ప్యాకేజ్ ఫుడ్ అమ్మితే రూ.25 వేల జరిమానా. రెండోసారి అదే తప్పు చేస్తే రెట్టింపు జరిమానా. కేసు తీవ్రతను బట్టి ఈ జరిమానా లక్ష రూపాయలకు పెరగడంతోపాటు ఆరు నెలలు జైలు శిక్ష కూడా ఉంటుంది.

*విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నస్తువు కానీ, సొంతం ప్యాక్ చేసుకున్న ఉత్పత్తులు గానీ సరైన పరిమాణం లేకపోయినా, తూకంలో తేడ ఉన్న ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు పదివేల జరిమానా ఉంటుంది

*నాణ్యతలేని ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న, దాని తూకం, పరిమానంలో తేడాలున్న రూ.50 వేల జరిమానా. రెండోసారి అదే తప్పు జరిగితే  ఏడాది జైలు శిక్షతోపాటు 50 వేల జరిమానా ఉంటుంది.

మల్టీప్లెక్స్ ల్లో, సినిమా హాళ్లల్లో ఆహార పదార్థాలను ఎమ్మార్పీకి మించి అమ్మినా, ఇతరత్రా ఫిర్యాదులు చేయాలన్న టోల్ ఫ్రీ నెం.180042500333 లేదా వాట్సాప్ నెం. 7330774444కు ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates