మల్టీఫ్లెక్స్ ల మోసాలు: అధిక ధరలతో నిలువు దోపిడి

multiplex-theatreపైకి హంగుగా, ఆకర్షణీయంగా ఉండే షాపింగ్ మాల్స్ లోపలికెడితే మాత్రం కస్టమర్లను నిలువు దోపిడీ చేస్తున్నాయి. కళ్లు చెదిరే లైట్లతో, అట్రాక్టివ్ డిస్ ప్లే వెనక జరిగేదంతా మోసమే..షాపింగ్ మాల్ సోకు చూసి లోపలికెళ్లామా మనం అడ్డంగా బుక్కయిపోడం ఖాయం. ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగ దారులను ఆకట్టుకునే షాపింగ్ మాల్స్ తూనికలు- కొలతలు, నాణ్యత విషయంలో దారుణంగా మోసగిస్తున్నాయి. తూకాల్లో మోసంతో పాటూ సరుకు ఎప్పుడు, ఎక్కడ తయారైంది, దాని ఎక్సపైరీ డేటేంటి అన్న మినిమమ్ వివరాలు లేకుండానే.. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే రెండు, మూడు రెట్లు అధికంగా అమ్ముతున్నారు.

నగరంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ఈ షాపింగ్ మాల్స్ పై తూనికలు కొలతల అధికారులు దాడులు చేశారు. ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ మల్టీ ఫెక్స్ లపై దృష్టి సారించారు. 15 ప్రత్యేక టీంల ను ఏర్పాటు చేశారు. ఒక్కో టీం ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న ఒక్కో మల్టీఫ్లెక్స్ ను తనిఖీ చేసే బాధ్యతను అప్పగించారు. ఆదివారం(జూన్-3) ఒకే టైంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 15 మల్టీఫ్లెక్స్ లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తూకం వేసే మిషన్లనే ట్యాంపరింగ్ చేశారు నిర్వాహకులు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మటం..తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నందున ఒకే రోజు 105 కేసులు నమోదు చేశారు అధికారులు. మల్టీఫ్లెక్స్ ల్లో జరుగుతున్న మోసాలపై వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని..అనుమానం వస్తే ….7330774444 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రూల్స్ ను పాటించకుండా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్న మల్టీఫ్లెక్స్ ల్లో బడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

మల్టీఫ్లెక్స్- కేసులు

ప్రసాద్ ఐమాక్స్-10

కార్నివాల్ సినిమాస్, అమీర్ పేట్-7

ఐనాక్స్ మహేశ్వరి-3

జీవీకే వన్ ఐనాక్స్-2

పీవీఆర్ హైదరాబాద్ సెంట్రల్-12

పీవీఆర్ ఇనార్బిట్-7

పీవీఆర్ ఫోరం మాల్-10

సినీ పాలిస్ మంజీరా మాల్-6

సినీ పాలిస్ సీసీపీఎల్-5

మిరాజ్ దిల్ సుఖ్ నగర్-6

పీవీఆర్ ఐకాన్ హైటెక్-13

పీవీఆర్ నెక్ట్స్ గల్లేరియా మాల్-14

ఏషియన్ జేపీఆర్ కూకట్ పల్లి-3

ఏషియన్ రాధికా ఈసీఐఎల్-2

Posted in Uncategorized

Latest Updates