మళ్లీ అంబానీనే టాప్… ఫోర్బ్స్ లిస్ట్ విడుదల

భారత్ లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ర్టీస్  అధినేత ముఖేశ్ అంబానీ వరుసగా 11వ సారి స్థానం సాధించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్ 2018 సంవత్సరానికి రిలీజ్ చేసిన భారత సంపన్నుల జాబితాలో రూ.3.49 లక్ష‌ల కోట్లతో ముఖేశ్ అంబానీ టాప్ ప్లేస్ లో నిలిచారు.

లిస్ట్ లో విప్రో ఛైర్మన్ అజిమ్ ప్రేమ్ జి సెకండ్ ప్లేస్,ఏర్సెలార్ మిట్టల్ ఛైర్మన్  లక్ష్మీ మిట్టల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఫోర్బ్స్ లిస్ట్ లో కేవలం నలుగురు మహిళలు మాత్రమే స్థానం సాధించారు.

ఫోర్బ్స్ రిలీజ్ చేసిన టాప్.10 లిస్ట్..

  1. ముకేశ్‌ అంబానీ(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌)
  2. అజిమ్‌ ప్రేమ్‌జీ(విప్రో)
  3. లక్ష్మీ మిట్టల్‌(ఏర్సెలార్‌ మిట్టల్‌)
  4. హిందుజా బ్రదర్స్‌(అశోక్‌ లేల్యాండ్‌)
  5. పల్లోంజీ మిస్త్రీ(షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌)
  6. శివ్‌ నాడార్‌(హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌)
  7. గోద్రేజ్‌ కుటుంబం(గోద్రేజ్‌ గ్రూప్‌)
  8. దిలీప్‌ సంఘ్వీ(సన్‌ఫార్మా ఇండస్ట్రీస్‌)
  9. కుమార్‌ బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌)
  10. గౌతమ్‌ అదానీ(అదానీ పోర్ట్స్‌)

 

Posted in Uncategorized

Latest Updates