మళ్లీ ఎప్పుడు పుడతావ్ : #ComeBackDiva

05కళ్లతోనే కనికట్టు.. చెరగని చిరునవ్వు.. భారతదేశ వెండితెర ఆరాధ్య దేవత.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి మనస్సుల్లో తన నటనతో చిరస్థాయిగా నిలిచిన నటి శ్రీదేవి. నీవులేని వెండి తెర మూగబోయింది.. లైట్స్, కెమెరా నిశ్సబ్ధంగా ఉన్నాయి. ఇలాంటి నటిని మళ్లీ చూస్తామా అంటూ శోకసంద్రంలో మునిగిపోయాయి సినీ ఇండస్ట్రీలు. భువి నుంచి దివికి వెళ్లిన నీవ్వు.. మళ్లీ భువికి రాకపోతావా అంటూ శ్రీదేవి జ్ణాపకాలను నెమరవేసుకుంటున్నారు.

మళ్లీ ఎప్పుడు పుడతావ్.. #ComeBackDiva

వెండితెర దేవత, అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. శ్రీదేవి మృతి షాక్ నుంచి తేరుకోవటం లేదు. బాలనటి నుంచి అమ్మ పాత్రల వరకు నటనలో జీవించింది. బాలనటిగా నటించిన హీరోతోనే.. హీరోయిన్ గా నటించి మెప్పించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. ఒక్కసారైనా శ్రీదేవితో నటించాలనే కోరిక ప్రతి హీరో వ్యక్తం చేయటం అంటే.. ఆమె అందం.. ఆమె నటన ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీదేవిని డైరెక్ట్ చేయాలంటే.. దర్శకులకు ఓ సవాల్. నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేశారు. సినిమా శ్రీదేవి ఉంది అంటే చాలు.. ఎక్కడ లేని క్రేజ్. ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు అతిలోక సుందరిగా ఆరాధ్య నటి అయ్యారు.

శ్రీదేవి మరణంతో దేశంలోని సినీ పరిశ్రమలు మూగబోయాయి. 54 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతుంది సినీ ఇండస్ట్రీ. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదంటూ అందరూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. సిని ఇండస్ట్రీకి ఇది చీకటి రోజు అంటున్నారు. తమిళం, మళయాళం, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా వెలుగొందారు. ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ స్టార్, ఎవర్ గ్రీన్ గా తన ప్రస్థానం కొనసాగించిన ఏకైక నటి శ్రీదేవి ఒక్కరే. 300 సినిమాల్లో నటించి.. 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆమె సొంతం అయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates