మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం గెలువాలని పూజలు

హైదరాబాద్: తెల్లారితే ఎన్నికల ఫలాతాలు వెల్లడికానున్నాయి. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపై కన్నేస్తున్నారు పార్టీల నేతలు. మరికొందరు తమ నాయకుడు గెలువాలంటూ పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ..టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ గెలుపు కోసం ప్రత్యేక హోమం, యాగం, గోమాత పూజ, దేవత విగ్రహాలకు పూజలు నిర్వహించారు.

వేద పండితులతో కలిసి నల్లపోచమ్మ- తుల్జాభవానీ, దుర్గాదేవి విగ్రహాలకు కుంకుమార్చనలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జియాగూడ డివిజన్ కార్పొరేటర్ మిత్రకృష్ణ అన్నారు. ఆదివారం చారిత్రాత్మకమైన సంజయ్‌నగర్ నల్లపోచమ్మ-తుల్జాభవానీ దేవాలయంలో కార్పొరేటర్ మిత్రకృష్ణ. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates