మళ్లీ తగ్గిన వొడాఫోన్‌‌ ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌ కస్టమర్లు

జియోకు కొత్తగా 82.6 లక్షల మంది యూజర్లు

ట్రాయ్‌‌ డేటా వెల్లడి

వొడాఫోన్‌‌–ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌లకు మరోసారి జియో సెగ తగిలింది. ఈ ఏడాది జూన్‌‌ నెలలో ఈ రెండు కంపెనీలు 41.75 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి.   జియో 82.6 లక్షల మందిని కస్టమర్లుగా చేర్చుకుంది. అయితే 38.32 కోట్ల మంది కస్టమర్లతో ఇప్పటికీ వొడాఫోన్‌‌–ఐడియా మొదటిస్థానంలో ఉంది. 33.12 కోట్ల మంది కస్టమర్లతో జియో రెండోస్థానంలో నిలిచింది. ఎయిర్‌‌టెల్‌‌ కస్టమర్ల సంఖ్య 32.03 కోట్లు నమోదైందని ట్రాయ్‌‌ తెలిపింది. రిలయన్స్‌‌ జియో మేనెలలోనూ 81.80 లక్షల మందిని కస్టమర్లుగా మార్చుకుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్​ఎన్​ఎల్​ జూన్‌‌లో కొత్తగా 2.66 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకోవడం విశేషం. ఆదాయాలను మరింత పెంచుకోవడానికి వొడాఫోన్‌‌-ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌ మినిమం రీచార్జ్‌‌ ప్యాక్‌‌లను తప్పనిసరి చేశాయి. దీంతో కస్టమర్లు తగ్గారు. మే నెలలో వొడాఫోన్‌‌-ఐడియా 56.97 లక్షల మంది, ఎయిర్‌‌టెల్‌‌ 15.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి.

Latest Updates