మళ్లీ తెగబడ్డారు: పాక్ కాల్పులు..ఇద్దరు పౌరులు మృతి

pak
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదేపదే ఉల్లంఘిస్తోంది. జమ్మూ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్లతో పాక్ రేంజర్లు దాడులకు పాల్పడుతున్నారు. RS పురా, కథువాలోని హిరానగర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. భారత సైనిక శిబిరాలు, జనావాస ప్రాంతాలే  టార్గెట్ గా పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ రేంజర్లు మోర్టార్లతో దాడి చేయడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి.

సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. స్కూళ్లు మూసివేయడంతో.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి పాకిస్తాన్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే పాక్ జరిపిన కాల్పులకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వందలాది గ్రామాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో వారికి పునరావాసం కల్పిస్తున్నారు భారత భద్రతా దళాలు.

Posted in Uncategorized

Latest Updates