మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి

ఢిల్లీ : పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం పది గ్రాముల బంగారం ధర రూ.28వేలు ఉంది. పసిడి ధర మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా మారుతున్న పరిణామాలు వారం రోజుల్లోనే పసిడి ధరలను మళ్లీ పరుగులు పెట్టేలా చేశాయి. పది గ్రాముల బంగారం బిస్కెట్‌ మార్కెట్‌లో ఇవాళ రూ.32,670 పలికింది. ఇదే స్పీడ్‌ కొనసాగితే పసిడి మళ్లీ రూ.33వేలు దాటే అవకాశం ఉందన్నారు బులియన్‌ వర్గాలు.

బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర మూడేళ్ల నుంచి నిలకడగానే ఉంటోంది. పది గ్రాముల బంగారం రూ.32 వేల నుంచి రూ.31,500 మధ్య కొనసాగుతోంది. నెల రోజుల క్రితం పసిడి ధర భారీగా పతనమైంది. డాలర్‌, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, చైనా, అమెరికాల మధ్య వాణిజ్యపరంగా నెలకొన్న యుద్ధ వాతావారణం తదితర పరిణామాలు బులియన్‌ మార్కెట్‌పై పడ్డాయి. దీంతో పసిడి ధర రూ.30వేల దిగువకు చేరుకుంది. గతనెలలో పది గ్రాముల బంగారం బిస్కెట్‌ ధర రూ.28వేలు పలికింది. ధర మరింత తగ్గవచ్చని వినియోగదారులు భావించారు.కానీ శనివారం(అక్టోబర్ 13) నుండి బంగారం ధర మళ్ళీ పెరిగింది. ఊహించని విధంగా తగ్గి, మళ్ళీ గతం కంటే ఎక్కువగా పెరుగడంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు.

Posted in Uncategorized

Latest Updates