మళ్లీ పెళ్లి చేసుకుంటా : హింట్ ఇచ్చిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ.. గౌరవప్రదమైన వ్యక్తిగా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటానని అన్నారు. అయితే ఎవరిని పెండ్లి చేసుకునేది మాత్రం తెలుపలేదు. ప్రస్తుతం పుతిన్ వయసు 66 సంవత్సరాలు. 1983 లో ల్యూడ్మిలాను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి కాటెరినా, మారియా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2013 లో పుతిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి పుతిన్ చుట్టు రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు.. రష్యన్ మాజీ జిమ్నాస్ట్ అలినా క‌బేవాతో పుతిన్ డేటింగ్ చేస్తున్న‌ట్లు ఓ రష్యా న్యూస్ పేపర్ తెలిపింది.

 

 

Posted in Uncategorized

Latest Updates