మళ్లీ పెళ్లి  చేసుకుంటే ఆమెను పిలుస్తా: షమి

shamiభార్య హసీన్ జహాన్‌తో .. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.  సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూనే ఉన్నారు. షమి రంజాన్ తర్వాత రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ చెప్పింది జహాన్. అంతేకాదు తనకు విడాకులివ్వాలంటూ డబ్బు కూడా ఇస్తా అన్నాడని ఆరోపించింది. భార్య ఆరోపణల కు ధీటుగానే స్పందించాడు షమి. మొదటి పెళ్లితోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. మరో పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడినా అన్నాడు. కొన్ని నెలలుగా జహాన్ నాపై ఏవో ఆరోపణలు చేస్తూనే ఉంది. అందులో ఇది కూడా ఒకటన్నాడు. అది మంచిదే కదా… నా రెండో పెళ్లికి తనను కచ్చితంగా పిలుస్తాను అని షమి నవ్వుతూ చెప్పాడు. ఈ వివాదం తన ఏకాగ్రతను దెబ్బతీయలేదని, రాబోయే ఇంగ్లండ్ టూర్‌పై తాను దృష్టి సారించినట్లు తెలిపాడు షమి.

Posted in Uncategorized

Latest Updates