మళ్లీ మొదలైంది: ATM ల దగ్గర నో కాష్ బోర్డులు

ATMపెద్దనోట్ల రద్దు తర్వాత మొదటి మూడు నెలలు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు చలామణిలోకి రావడానికి 6 నెలలు పట్టింది. అయితే ప్రస్తుతం మళ్లీ  రాష్ట్రంలో డిమానిటైజేషన్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. బ్యాంకులో లక్ష రూపాయిలు తీసుకుందామని వెళితే క్యాష్ లేదని..కేవలం 40 వేలే ఇస్తామంటున్నారని జనం చెబుతున్నారు. మన క్యాష్ మనం తీసుకోవడానికి కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు.

బ్యాంకుల్లో పరిస్థితి ఇలా ఉంటే… ATMల్లో కూడా క్యాష్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా ATM లు బంద్ చేయడం, నో క్యాష్ బోర్డులు పెట్టడంతో చేతిలో డబ్బులు లేక జనం పరేషాన్ అవుతున్నారు.  పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం అందుకు సరిపడా కొత్తనోట్లను చలామణిలోకి తీసుకురాలేదు. ఎక్కువ లావాదేవీలన్నీ డిజిటల్ గానే జరగాలని చెప్పడంతో జనానికి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు 2వేల నోట్లు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వరకూ కార్పొరేట్, పొలిటీషియన్స్, బ్లాక్ మనీ రాయుళ్ల దగ్గర ఇరుక్కుపోయి చలామణిలో లేకుండా పోయాయి. మరోవైపు FRDI బిల్లు వదంతులు కూడా.. డిపాజిటర్స్ ని భయపెడుతోంది. బిల్లు వస్తుందో లేదో తెలీదు కానీ డిపాజిట్లను డ్రా చేసుకోవడం మొదలు పెట్టారు జనం. అంతేకాకుండా.. 2లక్షల 50 వేలకు మించి క్యాష్ డిపాజిట్ చేస్తే.. వివరాలు ఇవ్వాల్సి రావడంతో.. క్యాష్ డిపాజిట్ కి జనం ముందుకు రాకపోవడంతో బ్యాంకింగ్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది.

డిజిటల్ కాలం కదా అని.. ఆన్ లైన్ ట్రాన్షక్షన్స్ చేస్కుందామంటే… వీటి మీద సర్వీస్ ఛార్జీల మోత మోగుతోంది.  కనీసం ఆర్బీఐ వీటి మీద నైనా.. సర్వీసు ఛార్జీ తగ్గించినా బాగుంటుందంటున్నారు జనం. డిజిటలైజేషన్ ను ప్రొత్సహించాలనుకున్నప్పుడు.. వాటిపై సర్వీస్ ఛార్జిని తగ్గించాల్సిందే అంటున్నారు. కేంద్రం లేదా ఆర్బీఐ చర్యలు తీసుకోకపోతే మరింత కష్టకాలం తప్పదంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ఇలాగే ఇంకొన్నాళ్లు కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates