మస్ట్ గా తెలుసుకోవాలి : నీట్ అభ్యర్థులకు డ్రెస్ కోడ్

cbscనేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది CBSE. మెడికల్ కాలేజీలలో MBBS, BDS అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షలకు సంబంధించిన అడ్మిషన్ కార్డులను CBSE జారీ చేసింది. నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని చెప్పింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తేలికపాటి రంగులున్న హాఫ్ చేతుల దుస్తులు మాత్రమే వేసుకోవాలని తెలిపింది. షూ వేసుకోరాదని చెప్పింది. ఒకవేళ వారు తమకు ఇష్టమైన దుస్తులు ధరించాలంటే మాత్రం పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపింది. CBSE ఆదేశాల ప్రకారం అభ్యర్థులు తేలికపాటి దుస్తులు ధరించాలని, వాటికి పెద్దపెద్ద గుండీలు, బ్యాడ్జీలు, పువ్వులు లాంటివి ఉండకూడదని తెలిపింది. హై హీల్స్ ఉన్న చెప్పులు, బూట్లు వేసుకోకూడదంది.

మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఆ రోజు ప్రభుత్వ సెలవు దినమైనా తేదీలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. విద్యార్థులు వెంట తీసుకుచ్చే వస్తువులను భద్రపరిచేందుకు ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడించారు. మొబైల్స్ సహా ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని చెప్పింది. జామెట్రీ, పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, క్యాప్, వాచ్, మెటాలిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates