మస్ట్ రీడ్ : ఆధార్ వర్చువల్ ఐడీ ఇలా తీసుకోండి

aadhar-card-virtual-idవ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఆధార్‌ నంబర్ కు ప్రత్యామ్నాయంగా 16 అంకెల వర్చువల్‌ ఐడీ(VID) సేవలను ప్రవేశ పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా(UIDAI). పౌరుల వ్యక్తిగత గుర్తింపు, సర్టిఫికేషన్ సమయంలో ఇకపై ఆధార్‌ బదులు VID ని తెలిపితే సరిపోతుంది. ఈ విధానం జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. బీటా వర్షన్‌లో తెచ్చిన VIDని ప్రస్తుతానికైతే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆధార్‌ అడ్రస్ లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని UIDAI తెలిపింది. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి ఆర్ధిక లావాదేవీలను ట్రాక్ చేయబోమంది.

VID లాగిన్ కోసం..

…httph://uidai.gov.in లో ఆధార్ ఆన్ లైన్ సర్వీసెస్ విభాగంలో ఆధార్ సర్వీసెస్ లో వర్చువల్ ఐడీ(VID) జనరేటర్ ను ఎంచుకోవాలి

… కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ లను పూరిస్తే…మొబైల్ నంబరుకు OTP వస్తుంది.

… ఆ తర్వాత అదే పేజీలో OTPని ఎంటర్ చేసి జనరేట్ VID అనే బటన్ ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి

… ఆ వెంటనే మొబైల్ నంబరుకు వర్చువల్ ఐడీ వస్తుంది

… VIDని మర్చి పోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది. ఒక వేళ మర్చి పోయినా VIDని మళ్లీ పొందే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates