మహంకాళి బోనాలు : ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో ఆశాడమాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల సందర్భంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా జూలై 29, 30 తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం (జూలై-27) ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆంక్షలు 29న తెల్లవారుజాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు సోమవారం (జూలై-30) మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల సందర్భంగా భారీగా వచ్చే భక్తుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు కమిషనర్. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

జులై 29న ..
-పూజల సందర్భంగా మహంకాళి ఆలయం, టొబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్‌ లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు.
-సుభాశ్ రోడ్, బాటా చౌరస్తా, రాంగోపాల్‌ పేట మార్గాలను మూసివేస్తారు.
-ఆడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.
-జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు.

దారి మళ్లింపు..
-కర్బాలా మైదాన్ నుంచి మినిస్టర్ రోడ్‌ కు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ ను, ఆర్టీసీ బస్‌ లను రాణిగంజ్ చౌరస్తాలో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
-బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు.
-SBH చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు.
-ప్యారడైజ్ నుంచి RPరోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద SBH, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు.
-క్లాక్‌ టవర్ నుంచి RP రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు నుంచి SBH ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
-STO జంక్షన్ నుంచి MGరోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద HDFC బ్యాంకు వైపు మళ్లిస్తారు.

30న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు
-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెయింట్ మేరీ మార్గాలను మూసేస్తారు.
-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్‌ పల్లి, బాలానగర్, అమీర్‌ పేట వెళ్లే ట్రాఫిక్‌ ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, SBH వైపు నుంచి వెళ్లాలి.

ఉత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలు
-సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, SBH వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్, మహబూబీయ కాలేజీలో పార్క్ చేయాలి.
-కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.
-రాణిగంజ్, అడవయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు అడవయ్య మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.
-సుభాశ్ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్ జిల్‌ ఖానా ఓపెన్ ప్లేస్‌ లో పార్క్ చేయాలి.

Posted in Uncategorized

Latest Updates