మహకూటమిని ప్రజలు నమ్మలేదు: పవన్


కేసీఆర్ మళ్లీ సీఎం కావడం సంతోషంగా ఉందన్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ పార్టీ డొంక తిరుగుడు రాజకీయాలు చేయలేదన్నారు. వాళ్లు అనుకున్నది చేశారన్నారు. మిగతా వాళ్లలా..రోజుకో మాట మార్చలేదని… ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ పార్టీ నేతలు పని చేశారన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ అంగీకరించారన్నారు. ప్రజల కోసం ఆయన కమిట్ మెంట్ తో పని చేశారన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు పవన్.

మరోవైపు మహాకూటమి ఓడిపోవడానికి…వారిపై ప్రజలకు నమ్మకం లేకపోవడమే కారణమన్నారు. ఎదుటి వారిపై ఆరోపణలు చేయడమే మహకూటమి నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. ఇలాంటి కూటమిలను ప్రజలు ఎన్నో చూశారన్నారు. 2009లో టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేశారని… ప్రజలు అప్పుడు కూడా  ఆ కూటమిని గెలిపించలేదన్నారు. కూటములు నమ్మసక్యంగా ఉండాలన్నారు. లేదంటే ఓటమి తప్పదని స్పష్టం చేశారు జనసేనాని పవన్.

Posted in Uncategorized

Latest Updates