మహబూబాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేటీఆర్

KTR MBBమహబూబాబాద్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. బుధవారం (ఏప్రిల్-4) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, చందులాల్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మానుకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.  మానుకోట మామూలు గడ్డకాదని, తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదులను తరిమికొట్టిన ఘనత ఈ గడ్డకే దక్కిందన్నారు. పరిపాలన చేతకాదని హేళన చేశారని, అవన్నీ భరించి తెలంగాణ సాధించుకున్నామన్నారు. మానుకోటను జిల్లాను చేయడం సరైనదని, ఇంటింటికి మంచినీరు ఇస్తామన్నారు. ఓట్లకోసం తప్పుడు మాటలను చెప్పలేదని, మంచి పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చే విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు.

తెలంగాణ వస్తే మన బతుకులు చీకటిగా మారుతాయని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారని, కానీ..ఇప్పుడు 24 గంటల కరెంటు తీసుకువచ్చామని తెలిపిన కేటీఆర్..ప్రతి పక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. రైతుల మనసులను మార్చే ప్రయత్నాలు చేస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతలు అష్టకష్టాలు పడ్డారని, దేశంలోనే ఫస్ట్ టైం ఎరువుల కోసం పెట్టుబడి ఇస్తున్నామన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని, సంక్షేమంలో తెలంగాణ ముందుందు అన్నారు.

ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్క TRS తోనే సాధ్యం అవుతుందన్నారు. వితంతువులు, బోధకాల వ్యాధి గ్రస్థులు ఇలా.. చెప్పుకుంటూ పోతే అనేక పథకాలతో ప్రజలకు న్యాయం జరిగుతుందన్నారు. ఎవ్వరికి ఏం కష్టం వచ్చినా ఇట్టే స్పందించే ప్రభుత్వం మన ప్రభుత్వానిదని..కేంద్రం స్పంధించకున్నా..బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నరు. అవసరమైతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సింగరేణి ఆధ్వర్యంలో నడుపుకుందామని చెప్పారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates