మహబూబాబాద్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రతి ఇంటిని తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 40 బైకులు, 2లక్షల విలువైన మద్యం బాటిళ్లు, 4 ఇసుక ట్రాక్టర్లు, 30వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా అనుమనితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Latest Updates