మహబూబాబాద్ లోని నగల దుకాణంలో భారీ దొంగతనం

gold ornamentsమహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ నగల దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. దుకాణంలో ఉన్న 80 తులాల బంగారు నగలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 90 వేల నగదును అపహరించారు దొంగలు. దొంగలు తీసుకున్న పలు జాగ్రత్తల్లో భాగంగానే దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates