మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్ధాపన

ktrమహబూబ్ నగర్ టౌన్ లో 400 ఎకరాల్లో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఐటీ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్ కు శంకుస్ధాపన చేశారు ఐటీ మంత్రి కేటీఆర్. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, ఎంపీజితేందర్ రెడ్డి, తదితర నాయకులు ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్….టీఆర్ ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దిలో ముందుకుపోతుందన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో పాలమూరు అభివృద్ధికి టీఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కొందరు విమర్శించడం సరికాదని కేటీఆర్ తెలిపారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. జిల్లాలో చేనేత కార్మికులకు రూ. 25 కోట్ల వ్యయంతో హ్యాండ్లూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates