మహాకూటమిని మట్టిలో కలిపేస్తాం: హరీష్

మహాకూటమిని మట్టిలో కలిపేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగులో పర్యటించిన ఆయన… ములుగు మండలంలో ఉద్యాన విశ్వ విద్యాలయం, అటవీ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు. ములుగు మండలంలో కొండపోచమ్మ జలాశయం, విత్తన పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క TRS పార్టీకే ఉందన్నారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లను గెలిచి అధికారం చేపడతామన్నారు హరీష్.

Posted in Uncategorized

Latest Updates