మహాత్ముడికి ట్విట్టర్ ఘన నివాళి : అక్టోబర్-2 నుంచి స్పెషల్ ఎమోజీ

సోషల్ మీడియా సైట్ ట్విట్టర్..   జాతిపిత మహాత్మగాంధీకి ఘనంగా నివాళి అర్పించింది.  మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా “గాంధీ ఎమోజీ”ని ట్విట్టర్ స్పెషల్ గా డిజైన్ చేసింది.  మంగళవారం(అక్టోబర్.2) నుంచి  యూజర్లు ఈ ఎమోజీని ఉపయోగించొచ్చని.. వారం రోజుల పాటు ఎమోజీ యాక్టివ్ గా ఉంటుందని ట్విట్టర్ ఇండియా తెలిపింది.

యూజ‌ర్లు #GandhiJayanti, #MahatmaGandhi, #MKGandhi, #BapuAt150, #MyGandhigiri, #NexusOfGood, #MahatmaAt150, # లాంటి  హ్యాష్‌ ట్యాగ్‌ లను అటాచ్ చేసినప్పుడు.. వెంటనే స్పెషల్ ఎమోజీ కనిపిస్తుందని వెల్లడించింది.  ట్విట్టర్ అఫీషియల్ లోగోలోని కలర్స్ తో గాంధీ ఎమోజీని డిజైన్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates