మహాత్ముడికి రాహుల్ నివాళి

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ(మంగళవారం) ఢిల్లీలోని రాజ్‌ఘాట్ దగ్గర మహాత్ముడికి పుష్ప నివాళి అర్పించారు.  తర్వాత మధ్యాహ్నాం రాహుల్ నాగూర్ దగ్గర  ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ర్యాలీ నిర్వహించనున్నారు. వార్దాలో ఈ కార్యక్రమం జరగనున్నది. కలెక్టర్ ఆఫీసు దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. సేవాగ్రామ్‌లో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. 1942లో మహాత్ముడి నేతృత్వంలో ఇక్కడే కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కూడా రాజ్‌ఘాట్ దగ్గర మ‌హాత్ముడికి పుష్ప నివాళి అర్పించారు.

Posted in Uncategorized

Latest Updates