మహానటిలో దేవరకొండ : నిజం అందంగా ఉంటుంది

Vijaya Devarakondaటాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిర్మిస్తున్న అలనాటి నటి సావిత్రి జీవితగాథ ‘మహానటి’ మాత్రం షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంది. కీర్తి సురేష్, దుల్కర్‌ సల్మాన్‌, సమంత ‘మధురవాణి’ పాత్రకు సంబంధించిన లుక్స్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. లేటెస్ట్ గా యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు సంబంధించిన లుక్‌ను మూవీ టీం  రిలీజ్ చేసింది. స్కూటర్‌పై వెళ్తున్న విజయ్‌.. అచ్చం పాతకాలపు సినిమా హీరోలా ఉన్నాడు. ‘నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణీ గారు’ అంటూ పోస్టర్‌పై మెసేజ్ ఉంది. ఈ సినిమాలో విజయ్‌ పాత్ర పేరు కూడా విజయ్‌ ఆంటోని అని తెలిపారు. ‘మహానటి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Posted in Uncategorized

Latest Updates