మహానటిలో మధురవాణి ఈమె

SSనాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మహానటి. ఈ సినిమా మే9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా సినిమాలోని ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చేస్తున్న యూనిట్ ..శుక్రవారం (ఏప్రిల్-6)న సమంత పాత్రకు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేసింది. ఈ లుక్ ని సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసి, సంతోషాన్ని వ్యక్త పరిచింది. మహానటిలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుందని, మధురవాణిగా పరిచయంకానున్నట్లు తెలిపింది. ఈ ఫోటోలు సమంత మధురవాణి BA గోల్డ్ మెడలిస్ట్ అని ఉంది. అలాగే ..నా పేరు కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే అని ఉంది. ఇప్పటికే రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా..ఇప్పుడు మధురవాణిగా..రేపు ఇంకెలాంటి క్యారెక్టర్ తో వస్తారో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహానటి కోసం సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోబోతుంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్ లో నిర్మించిన మహానటిలో.. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌,  విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates