మహానటి బిడ్డ కూడా : ఆ హీరో కుమార్తెలు ఇలా కలిశారు

JEMIమహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంతటి సంచలనమో అందరికీ తెలిసింది . ఆ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేషన్. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో అందరికీ తెలిసిపోయింది. మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ ప్రేమ రాజ్ కు ఏడుగురు కుమార్తెలు. వీరికి తల్లులు వేరు అయినా.. తండ్రి ఒక్కరే. ఆయనే జెమినీ గణేషన్. మహానటి మూవీ తర్వాత ఆయన భార్యలు, సంతానంపై పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఈ టైంలోనే ఆయన కుమార్తెలు అందరూ ఒకే వేదికపైకి వచ్చి.. అందర్నీ షాక్ కు గురి చేశారు.

జెమినీ గణేషన్ కి నలుగురు భార్యలు, ఏడుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ కూడా జెమినీ గణేషన్ కుమార్తె. రెండో భార్య పుష్పవల్లి కూతురే ఈమె. ప్రతి ఏడాది ఒక్కసారైనా ఈ అక్కచెల్లెలందరూ కలుసుకుంటారు. అలాగే మే 18వ తేదీ శుక్రవారం.. చెన్నై సిటీలో ఈ ఏడుగురు అక్కాచెల్లెల్లు ఒకే చోట కలుసుకున్నారు. అప్పడు తీసిన ఫొటోనే ఇది. జెమినీ గణేషన్ కు ఒకే ఒక్క కుమారుడు. అతను కూడా సావిత్రి సంతానం. మిగతా ముగ్గురు భార్యలకు మగ సంతానం లేదు. వీరి ఫొటో చెన్నై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates