మహానుభావుల ప్రేరణతో.. : ఎన్టీఆర్ షేర్ చేసిన.. చెర్రీ ఫీలింగ్

NTR Cherryఒక్క ఫొటో.. ఒక్క చిత్రం చాలు వంద అర్థాలు వెతుక్కోవటానికి.. వంద కథలు రాసుకోవటానికి.. సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు.. బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ – రాంచరణ్ అన్న సంగతి అందరికీ తెలిసింది. ఎన్టీఆర్ తీసిన రాంచరణ ఫొటో ఇప్పుడు సినీ ఇండస్ట్రీతోపాటు.. అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ చిత్రం వెనక వివరాల్లోకి వెళితే.. జూన్ 8వ తేదీ ఉదయం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు రాంచరణ్. హాల్ లో కూర్చుకున్నారు. అక్కడే తాత ఎన్టీఆర్ ఫొటో ఉంది. ఈ ఫొటోను రాంచరణ్ చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ తన కెమెరా నుంచి క్లిక్ అనిపించారు. ఈ ఫొటోను చెర్రీకి కూడా చూపించలేదంట. నేరుగా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి చెర్రీకి సైతం షాక్ ఇచ్చారంట. ఈ ఫొటోకు ఎన్టీఆర్ పెట్టిన క్యాప్షన్ ఏంటంటే.. మహానుభావుల నుంచి ప్రేరణతో అన్నారు.

ఎన్టీఆర్ – రాంచరణ్ అభిమానులు మొత్తం ఈ ఫొటోకు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు విపరీతంగా లైక్ చేసేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates