మహాప్రభో మీకు దండం : శ్రీరెడ్డి ఇష్యూకి పరాకాష్ఠ

sri-redశ్రీరెడ్డి ఇష్యూ పరాకాష్ఠకి చేరిందా.. రాంగోపాల్ వర్మ ఇన్వాల్వ్ అయిన తర్వాత అసలు విషయం దారితప్పి.. పవన్ కల్యాణ్ వర్సెస్ శ్రీరెడ్డిగా మారిపోయింది. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయటం ఇంకా హైలెట్ అవుతావు అని నేను చెప్పటంతోనే.. శ్రీరెడ్డి అలా యూటర్న్ తీసుకుందని చెప్పాడు. అందుకు సారీ కూడా చెప్పాడు. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది.

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశాన్ని.. వర్మ, శ్రీరెడ్డికి అన్వయిస్తూ ఫొటోషాప్ చేశారు. ద్రౌపదిగా శ్రీరెడ్డిని.. శ్రీకృష్ణుడుడి రాంగోపాల్ వర్మ ఫొటోలను పెట్టి మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటో అటూ ఇటూ తిరిగి జాతీయ మీడియాకి ఎంటర్ అయిపోయింది. వర్మ ఆ ఫొటోపై స్పందించటంతోపాటు.. ట్విట్ చేయటంతో మరింత ఇష్యూ అయ్యింది. నడిచేది, నటించేది శ్రీరెడ్డే అయినా.. తెర వెనక ఉండి నడిపిస్తున్నది మాత్రం శ్రీకృష్ణుడి అవతారంలోని రాంగోపాల్ వర్మ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే శ్రీరెడ్డి ఇష్యూకి ఇది పరాకాష్ఠ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు అయితే మహాప్రభో మీకో దండం అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates