మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..17 మంది మృతి

TRUCK ACCIDENTమహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం(ఏప్రిల్-10) కండాల మండలంలో ముంబయి – బెంగళూరు జాతీయ రహదారిపై రెయిలింగ్‌ ను డీసీఎం వాహనం ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు.

డ్రవర్ నియంత్రణను కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, మరణించినవారు పూణేకు చెందిన కార్మికులు అని తెలిపారు సతారా పోలీసులు. బీజీపూర్ నుంచి పూణేకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఖండాల సొరంగం సమీపంలో ఉన్న S ఆకారంలో రోడ్డు ఉండటంతోనే ఈ ప్రదేశంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates