మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో నిన్న(శనివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కొర్పన ప్రాంతంలో వ్యాను, ట్రక్‌ ఢీకొనడంతో వ్యాను డ్రైవర్‌తో సహా 11 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు.

ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు  తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు.

Posted in Uncategorized

Latest Updates