BJP పాలిత రాష్ట్రాల్లో రూ.5 తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్

ముంబై : లీటర్ పెట్రోల్ , డీజిల్ పై రూ.రెండున్నర తగ్గించిన కేంద్రం ప్రభుత్వానికి… బీజేపీ పాలిత రాష్ట్రాలు ధన్యవాదాలు తెలిపాయి. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్ గఢ్, త్రిపుర, జార్ఖండ్ ఇలా.,… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.రెండున్నర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఓవరాల్ గా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.5 తగ్గించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. సామాన్యులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారని… అందుకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్.

కేంద్రం కోరినట్టుగా… మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.రెండున్నర తగ్గిస్తున్నట్టు ఫడ్నవీస్ ప్రకటించారు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా.. అరుణ్ జైట్లీ సూచనను మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. ఫడ్నవీస్ ప్రకటించిన తగ్గింపుతో… మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై రేటు ఒక్కసారిగా రూ.ఐదు రూపాయలు తగ్గినట్టు అయింది.

ఇటీవలే ముంబైలో లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్ 90 రూపాయలు దాటింది. పవర్ పెట్రోల్ రేట్ పలు ప్రాంతాల్లో వంద రూపాయలు దాటింది. తాజాగా.. ఐదు రూపాయల తగ్గింపుతో సామాన్యులకు భారం తగ్గినట్టే అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates