మహా యుద్ధంలో డబ్బే డబ్బు : వాళ్ల ప్రైజ్ మనీ.. మన కార్పొరేషన్ బడ్జెట్ అంత

World-Cup-2018గ్రౌండ్ లో ఓ చిరుత పరిగెడుతుంటే ఎలా ఉంటుంది.. టెన్షన్ టెన్షన్.. అదే 22 చిరుతలు హోరాహోరీగా కలబడుతుంటే.. అదేనయ్యా ఫుట్ బాల్ అంటే.. 90 నిమిషాల ఆట.. ప్రతి సెకను ఉత్కంఠ.. నువ్వా నేనా అని.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. జస్ట్ 90 నిమిషాల్లోనే గేమ్ ఓవర్.. విజేత కూడా తేలిపోతుంది.. కానీ 90 నిమిషాలే.. ఫుట్ బాల్ అభిమానికి నిజమైన మజా ఇస్తోంది. రెండు దేశాల తరపున 22 మంది కొట్టుకుంటుంటే.. ఆ దేశాలు మొత్తం కళ్లప్పగించి చూస్తుంటాయి. గెలిచేది జట్టే అయినా.. అక్కడ గర్వంగా నిలబడేది మాత్రం ఆ దేశంలోని ప్రజలు.. ప్రతి మ్యాచ్ ఓ మహా సంగ్రామం.. ప్రతి గోల్ ఓ విజయ దాహం.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న సాకర్ సంరంభం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నది. ఈ ప్రపంచ ఫుట్ బాల్ కప్ లో మరో విశేషం కూడా ఉంది. అదే డబ్బు.. డబ్బు.. డబ్బు.. ప్రైజ్ మనీనే వేల కోట్లలో ఉంటే.. ఈ టోర్నమెంట్ ఎన్ని లక్షల కోట్లో ఇట్టే చెప్పేస్తోంది..

2018 ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు 32 జట్లు ఎంపిక అయ్యాయి. వీరికి వందల కోట్లలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ప్రతి జట్టు కనీసం 54 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ తీసుకోబోతున్నది. గ్రూప్ దశలో ఓడిన జట్టుకు రూ.54 కోట్లు దక్కనున్నాయి. అదే విధంగా ప్రీక్వార్టర్ నుంచి నిష్క్రమించిన జట్టు రూ.81 కోట్లు తీసుకుంటుంది. క్వార్టర్స్ లో ఓడిన జట్టు రూ.108 కోట్లతో తిరుగుముఖం పడుతుంది. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.148 కోట్లు దక్కనున్నాయి. మూడో స్థానంలో ఉండే జట్టుకు రూ.161 కోట్లు దక్కుతాయి. రన్నరప్ గా సెకండ్ ప్లేస్ లో ఉండే జట్టు రూ.188 కోట్ల తీసుకోబోతున్నది. ప్రపంచ విజేతగా నిలిచే జట్టు ఏకంగా రూ.256 కోట్లను కొల్లగొట్టనుంది. మొత్తంగా ఆటగాళ్లు, జట్లకు ప్రైజ్ మనీగానే.. ఏకంగా రూ.2వేల 701 కోట్లు చెల్లించనుంది ఫుట్ బాల్ సమాఖ్య.  ఈ డబ్బు.. మన కార్పొరేషన్ బడ్జెట్ అంత.. కొన్ని కార్పొరేషన్ల బడ్జెట్ కంటే తక్కువ కూడా.. కేవలం ఫ్రైజ్ మనీనే 2వేల 701 కోట్లుగా ఉంటే.. మొత్తం ఈ టోర్నమెంట్ విలువ లక్షల కోట్లలో ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates