మహా శివరాత్రి..పూలు, పండ్లకు ఫుల్ గిరాకీ

Fruit_Marketమహా శివరాత్రి సందర్భంగా మార్కెట్ లో పండ్ల ధరలు కొండెక్కాయి. శివరాత్రి పండగకు భక్తులు జాగారం చేస్తూ భక్తి ప్రవత్తులతో వివిధ రకాల పండ్లను శివునికి నైవేధ్యంగా పెడతారు.అందుకే వివిధ ప్రాంతాల నుంచి రకారకాల పండ్లు, పూలు హైదరాబాద్ మార్కెట్ కి ఇంపోర్ట్ అవుతాయి.  శివరాత్రి అంటేనే ఉపవాసాలు, జాగారంతో కూడిన పండుగ. దాంతో పూలు, పండ్లకు ఫుల్లు డిమాండ్.

గడ్డి అన్నారం, ఓల్డ్ మోండా మార్కెట్, మొజంజాహి మార్కెట్ లు పూలు పండ్లకు ఫేమస్. శివరాత్రికి ఆ మార్కెట్స్ లోకి వివిధ ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతి అవుతాయి. శివరాత్రికి నాలుగు రోజుల ముందు నుంచే సిటీలో చాలా చోట్ల పండ్ల వ్యాపారం ఊపందుకుంది. దీంతో సిటీలో ఎక్కడ చూసినా పూలు .. పండ్లు అమ్మే వ్యాపారులే కనబడుతున్నారు.

మామూలు రోజులతో పోలిస్తే… పండగలు వచ్చాయంటే పూజా సామాగ్రి మొదలు.. పూలు ..పండ్ల ధరలకు కూడా రెక్కలొస్తాయి. హోల్ సేల్ మార్కెట్ నుంచి మొదలయ్యే ధరలు రిటైల్ వరకు మండుతూనే ఉంటాయి. మామూలు రోజులతో పోలిస్తే పండగల సమయంలో 20 నుంచి 30 శాతం ధరలు పెరగటం కామన్ గా మారింది. హోల్ సేల్ మార్కెట్… రిటైల్ మార్కెట్స్ ధరల మధ్య సామాన్యులపై భారం తప్పడం లేదు.

శివరాత్రి రోజు జాగారం చేసి పూలు, పండ్లతో పరమశివుడిని ప్రార్ధిస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. పబ్లిక్ అవసరాలు.. డిమాండ్ ని బట్టి మార్కెట్ లో పూలు.. పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. బంతి, చామంతి 50 రూపాయలు కిలో పలికిన పూలు.. ఇప్పుడు రూ. 200కి పైనే అమ్ముతున్నారు. ఇక పండ్లను చూస్తే … సంత్ర, బత్తాయి ఒక్కోటి 10 నుంచి 15 రూపాయలు అమ్ముతున్నారు. ద్రాక్ష కిలో రూ.  80 నుంచి రూ. 100  పలుకుతోంది.

సంవత్సరం మొత్తంలో పండగలు వచ్చినప్పుడు పూలు, పండ్ల ధరలు పెరగటం కామన్ అయ్యింది. దీంతో జనం కూడా అలవాటు పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates