మహా సంప్రోక్షణ టైంలో పరిమిత దర్శనం

మహా సంప్రోక్షణ  టైంలో  పరిమిత సంఖ్యలో  దర్శనం కల్పించాలని  టీటీడీ పాలక  మండలి  నిర్ణయించినట్లు తెలిపారు  ఛైర్మన్  పుట్టా సుధాకర్ యాదవ్.  అన్నమయ్య భవన్ లో  సమావేశమైన  పాలక మండలి  పలు కీలక నిర్ణయాలు  తీసుకుంది. 11న  తొమ్మిది గంటలు,  12న నాలుగు గంటలు,  13న నాలుగు, 14న ఐదు గంటలు, 16న నాలుగు గంటలు  మాత్రమే  స్వామి వారి  దర్శనానికి అనుమతి  ఇస్తున్నామన్నారు.

అయితే కేవలం సర్వదర్శన  భక్తులకు మాత్రమే  అనుమతి ఉంటుందన్నారు.  మాజీ ఆలయ  ప్రధాన  అర్చకులకు  వన్ టైం  సెటిల్ మెంట్ లో  భాగంగా 30 లక్షల  ఇచ్చేందుకు  ఓకే చెప్పారు. తిరుచానూర్ పద్మావతి  అమ్మవారి  ఆలయంలో ఖాళీగా  ఉన్న రెండు  అర్చకుల  పోస్టుల భర్తీకి  ఆమోదం తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates