మహిళను కాలుతో తన్నిన ఎంపీపీ

Dharpally-MPP-Gopiనిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో మహిళపై దాడి చేశాడు దర్పల్లి ఎంపీపీ. ఆస్తి కోనుగోలు విషయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి చెప్పుతో కొట్టేందుకు మహిళ ప్రయత్నించింది. ఆగ్రహించిన ఎంపీపీ ఇమ్మడి గోపి.. మహిళను కాలితో తన్నాడు. దీంతో గొడవ పెరిగింది.
ఇందల్వాయి మండల కేంద్రంలో జాతీయరహదారికి అనుకొని ఉన్న 1107 సర్వేనంబర్ లో 1125గజాల భూమి, 200గజాల ఇల్లును దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి నుంచి గౌరారం గ్రామానికి చెందిన ఒద్దే రాజవ్వ కోనుగోలు చేసింది. ఏడాది క్రితమే రిజిస్ట్రేషన్, పంచాయతీలో పేరు మార్పు జరిగింది. ఇల్లు, స్థలానికి 36లక్షల 72 వేలు చెల్లించారు రాజవ్వ. మెయిన్ రోడ్డుకు ఉండటంతో… అదనంగా మరో 60లక్షలు ఇవ్వాలని ఎంపీపీ డిమాండ్ చేస్తున్నారు. ఎంపీపీ డిమాండ్ పై పోలీస్ స్టేషన్, కలెక్టర్ కు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయే సరికి…. ఇల్లు అప్పగించాలని ఇవాళ ఎంపీపీని కోరారు. ఈ విషయంలో రాజవ్వకు… ఎంపీపీ గోపికి మధ్య మాటమాట పెరగటంతో కోపోద్రేకుడైన ఎంపీపీ కాలితో తన్నాడు. ఆగ్రహించిన మహిళ కుటుంబసభ్యులు… కోనుగోలు చేసిన ఇంట్లో సామన్లు బయటపడేశారు. తమకు న్యాయం చేయాలని రాజవ్వ డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates