మహిళను ముక్కలుగా నరికిన కేసులో నిందితుల అరెస్ట్

MURDERమాధాపూర్ మహిళా హత్యకేసులో మంగళవారం (ఫిబ్రవరి-13) ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి హైదరాబాద్ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సైబరాబాద్ పోలీసులు 13 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత నిందితులను గుర్తించారు. మృతురాలి పేరు పింకీ కశ్యప్ అని, ఆమెను భర్తతో కలిసి సన్నిహితులే చంపేశారని పోలీసులు తేల్చారు.

వివరాల్లోకెళితే.. బీహార్‌కు చెందిన పికీ కశ్యప్.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్‌ను కొన్నేండ్ల కిందట పెళ్లి చేసుకున్నది. వీరు ప్రస్తుతం బీహార్‌కు చెందిన అమర్‌కాంత్ ఝా, తండ్రి అనిల్ ఝా, తల్లి మమత ఝా కుటుంబంతో సిద్ధిఖీనగర్‌లో ఉంటున్నారు. వారి ఇంట్లో ఏడు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. పింకీ కశ్యప్‌ను అమర్‌కాంత్ ఝా మర్డర్ చేశాడని, ఇంట్లోనే తల్లిదండ్రులు, ఆమె భర్త వికాస్, బాలుడి ముందే క్రూరంగా చంపేశాడని తేలింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత సంచుల్లో కుక్కి అమర్‌కాంత్, అతడి తల్లి మమతతో కలిసి బైక్‌పై తీసుకెళ్లి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసినట్టు తేలింది. పింకీని ఎందుకు హత్య చేశారో తేలాల్సి ఉంది. అమర్‌కాంత్ ఓ బార్ లో అటెండర్‌గా పనిచేస్తుండగా, పింకీ భర్త వికాస్, మమత కలిసి కొన్నాళ్లు గా పానీపూరీ బండి నడుపుతున్నారు. ప్రధాన అనుమానితులు అమర్‌కాంత్, వికాస్ పరారీలో ఉన్నారని, అమర్‌కాంత్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య. పోలీసులు అమర్‌కాంత్ ఝాను మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. నిందితులను మంగళవారం (ఫిబ్రవరి-13) మీడియా ముందు ప్రవేశపెట్లారు.

Posted in Uncategorized

Latest Updates