‘మహిళలకు అందం కంటే ఆరోగ్యమే ముఖ్యం’

క్యాన్సర్ ఒక పెయిన్ ఫుల్ డిసీస్ అని,  క్యాన్సర్ పై మహిళలు అవగాహనతో ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ… ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపడం లేదన్నారు. అందం కంటే ఆరోగ్యం ముఖ్యమని చెప్పారు”

మహిళలకు ఆరోగ్యం కంటే చీరలు, నగల మీదే మక్కువని అన్నారు గవర్నర్.  నెఫ్రాలజిస్ట్ అయిన తన భర్త  ఉచితంగా డయాగ్నసిస్ చేశారన్నారు.  ఓ  ఎగ్జిబిషన్ లో తాము డయాగ్నసిస్ పరీక్షలకు ఏర్పాటు చేయగా మహిళలు సారీ స్టాల్స్ కు వెళ్లారు కానీ స్క్రీనింగ్ స్టాల్ కు రాలేదన్నారు. వాళ్లను పిలిచి స్క్రీనింగ్ చేస్తే..  అందులో క్యాన్సర్ ఉన్న మహిళలు వున్నారన్నారు.

క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లొనే బయట పడుతున్నాయని, క్యాన్సర్ పేషంట్ కు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరమని తమిళిసై అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్తీ ఫుడ్ తీసుకోవాలని, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు.  మన మూలాలు మర్చిపోవద్దని, మన ట్రెడిషనల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదని  అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గొంగడి సునీత పాల్గొన్నారు. 5 వందల మందికి ఉచితంగా స్క్రీనింగ్ చేయించినందుకు గొంగడి సునీత కి గవర్నర్ అభినందనలు తెలిపారు.

Latest Updates