మహిళలకు ప్రమాదకరమైన దేశం ‘భారత్’

rape‘మహిళలకు చాలా ప్రమాదకరమైన దేశం భారత్‌’ అని వ్యాఖ్యానించింది థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్.  ప్రపంచ దేశాల్లో మహిళా భద్రతకు సంబంధించిన అంశాల పరిశీలన కోసం థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ  తరపున  550 మంది దిగ్గజాలు చేసిన సర్వేలో వెల్లడైన నిజం ఇది. గత ఐదేళ్ల నుంచి అంటే దేశ రాజధాని ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగిన తర్వాత మహిళల పట్ల కొనసాగుతున్న హింస మరింత ఎక్కువైందని ఈ ఫౌండేషన్ నివేదిక ప్రకటించింది.

మహిళల పట్ల లైంగిక వేధింపులు, సంస్కృతి – సాంప్రదాయల పేరిట జరిగే వేధింపులు, మానవ అక్రమ రవాణా, బలవంతంగా బానిసలుగా మార్చడం వంటి  మూడు అంశాల్లో భారత్‌ చాలా ప్రమాదకరమైన దేశంగా నిల్చింది. మహిళల భద్రతా విషయంలో నిత్యం యుద్ధంతో రగిలిపోయో సిరియా, పేద దేశాలైన సోమాలియా, అఫ్గనిస్తాన్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా భారత్‌ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది.

లైంగిక హింస, వేధింపులు, మహిళలను లైంగికంగా బలవంత పెట్టడం, అక్రమ రవాణా, లైంగిక బానిసలు, ఇంటి పనులకు బానిసలుగా చేయడం, బలవంతపు వివాహాలు, బ్రూణహత్యలు తదితర విషయాల్లో మహిళలకు ఎక్కడ ఎక్కువ ప్రమాదం ఉందనే విషయాల గురించి తెలపమని ఐదు ఐక్యరాజ్య సమితి దేశాలు కోరిన నేపథ్యంలో ఈ జాబితా తయారు చేసినట్లు వెల్లడించింది రాయిటర్స్‌ ఫౌండేషన్‌.

2011 నివేదికలో అఫ్గానిస్థాన్‌, కాంగో, పాకిస్థాన్‌, భారత్‌, సోమాలియా దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా తేలాయి. అయితే 2011 నివేదికలో భారత్‌ నాల్గో స్థానంలో ఉండగా ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడేళ్లలో భారత్‌లో మహిళలకు ప్రమాదం బాగా పెరిగిందని వెల్లడించింది ఫౌండేషన్. ఇదిలా ఉండగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం…2007 నుంచి 2016 మధ్య దేశంలో మహిళలపై జరిగిన నేరాలు 83శాతం పెరిగాయి. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates