మహిళలు ఆలయంలోకి వస్తే ఆత్మహత్యలే : అయ్యప్ప భక్తులు

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చు అని సుప్రీం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేఖంగా కేరళలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకురావాలన్న డిమాండ్‌ పై అయ్యప్ప భక్తులు లెక్కకు మిక్కిలిగా రోడ్లపైకి వచ్చారు.

నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తిరువనంతపురంలో అఖిల్ హిందూ పరిషత్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆదివారం (అక్టోబర్-14)న పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వందలాది మంది పిల్లలు, మహిళలు రోడ్లపైకి వచ్చి నినాదాలతో హోరెత్తించారు. తమిళనాడులోని చెన్నైలోనూ ఇదే తరహా ప్రదర్శనలు జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పును వ్యతికిస్తూ అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. లింగ వివక్ష కుదరదని, అయ్యప్ప ఆలయంలోకి వయోభేదం లేకుండా మహిళలంతా ప్రవేశించవచ్చని సెప్టెంబర్- 28న CJI దీపక్ మిశ్రా సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.

కేరళ ప్రభుత్వం ఈ తీర్పును స్వాగతించడంతో.. అయ్యప్ప భక్తులు సీరియస్ అవుతున్నారు. శివసేన కేరళ రాష్ట్ర విభాగం ఓ అడుగు ముందుకు వేసి.. యువతులెవరైనా అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే తమ మహిళా కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించింది. ఆత్మాహుతి బృందం 17, 18 తేదీల్లో పంబానది వద్దే ఉంటుందని తెలిపింది.  ఇప్పటికైనా ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని పందళ రాజ కుటుంబీకులు కోరుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates