మహిళల్లో స్ట్రోక్‌ రిస్కును తగ్గించే కమలా పండు

 కమలాపండులో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని ఇది బలోపేతం చేస్తుంది. అంతేకాదు చలి కాలంలో విరివిగా లభించే ఈ సీజనల్‌ ఫ్రూట్‌ వల్ల బోలెడన్ని లాభాలున్నాయి. అవేంటంటే…

చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. ఇందులోని విటమిన్‌ -ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచుపదార్థం, పొటాషియం, విటమిన్‌ -సి లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో స్ర్టోక్‌ రిస్కును తగ్గిస్తుంది.

ఆరెంజ్‌ జ్యూస్‌ తాగితే కిడ్నీ వ్యాధుల బారి నుం చి తప్పించుకోవచ్చు. వైరల్‌ ఇన్ఫెక్షన్లపై ఈ పండు బాగా పనిచేస్తుంది. ఈ పండులోని ఫోలిక్‌ యాసిడ్‌ బ్రెయిన్‌ డెవలప్‌ మెంట్‌ కు సహకరిస్తుంది. ఇందులో యాం టీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఈ పండు మంచిది. అల్సర్లు రాకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసన నివారిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates