మహిళల కోసం: మార్చి 8న వీ-హబ్

ktrపారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాల కోసం తెలంగాణ పోటీపడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఇందుకోసం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వంటి సంస్థలు నిర్మాణాత్మకమైన సూచనలతో రాష్ట్ర ప్రభుత్వానికి సహాకరించాలని విజ్ఞప్తి చేశారు. సిఐఐ-దక్షిణ ప్రాంత మండలి సమావేశంలో కెటిఆర్‌ ఈ విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా కాలేజీలు, ఇండస్ట్రీల అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలన్నారు. త్వరలో అత్యాధునిక తయారీ సంస్థ(ఎఎంఐ)ను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సంస్థను జర్మనీ తరహాలో ఏర్పాటు చేయాలా? లేక మరో పద్ధతిలో ఏర్పాటు చేయాలా? అనే విషయంలో సిఐఐ అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే మొదటి సారిగా విమెన్ ఎంటర్ ప్రైన్యూర్ హబ్( వీ-హబ్) ను మార్చి 8న అంతర్జాతయ మహిళా దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఒక ఇన్‌క్యుబేటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates