మహిళల టి20 వరల్డ్ కప్: భారత టీం ఇదే

మహిళల టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఇవాళ BCCI ప్రకటించింది. నవంబర్ 9 నుంచి 24 వరకూ జరిగే  ఐసీసీ ఉమెన్స్‌ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లకు వెస్టిండీస్‌ వేదిక కానుంది. భారత్ తో సహా పది దేశాల జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. హర్మన్‌ ప్రీత్‌ను కెప్టెన్‌గా, స్మృతి మందానను వైస్‌ కెప్టెన్‌గా BCCI ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్,ఐర్లండ్ లు గ్రూప్-బి లో ఉండగా… గ్రూప్‌-ఏలో డిపెండింగ్‌ ఛాంపియన్స్‌, ఆతిథ్య వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి.

విమెన్స్ టి20 వరల్డ్ కప్ కు ఎంపికైన జట్టు:

హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్), స్మృతి మందాన(వైస్ కెప్టెన్), మిథాలీరాజ్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తిశర్మ, తాన్యా భాటియా(కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజాపాటిల్, ఏక్తా భిష్త్, హేమలత, మాన్షి జోషి, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates