మహిళల వన్డే మ్యాచ్ : మగాళ్లు సాధించలేనిది వీళ్లు చేసి చూపించారు

nzక్రికెట్ చరిత్రలోనే న్యూజిలాండ్ మహిళల జట్టు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. శుక్రవారం(జూన్-8) ఐర్లాండ్‌ తో జరిగిన మెదటి వన్డేలో న్యూజిలాండ్ మహిళల టీమ్ స్టేడియంలో పరుగుల వరద పారించింది. గతంలో తమ పేరిటే ఉన్న అత్యధిక స్కోరు రికార్డు ను బద్దలు కొడుతూ ఎవ్వరి ఊహలకు అందనంత విధంగా 490 పరుగులు నమోదు చేశారు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకూ అటు మెన్ క్రికెట్ కానీ, ఇటు ఉమెన్ క్రికెట్ లో కానీ ఇదే హైయస్ట్ స్కోర్ గా నిలిచింది. 346 పరుగులతో ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించి ప్రపంచ రికార్డుని నెలకొల్పిన న్యూజిలాండ్ మహిళల టీమ్ ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.

టాస్‌ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. కెప్టెన్‌ సుజీ బేట్స్‌ 94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సులతో చెలరేగి 151 పరుగులు చేయగా, 15 ఫోర్లు, 1 సిక్సుతో 77 ఒంతుల్లోనే 121 పరుగులు చేసి ఐర్లాండ్ కు చుక్కలు చూపించారు. మెత్తం రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ టీమ్ రెచ్చిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌట్ అయింది. 1997లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ మహిళల జట్టు 5 వికెట్లకు 455 పరుగుల రికార్డు స్కోరును మళ్లీ తమ రికార్డును తామే బ్రేక్ చేశారు న్యూజిలాండ్ మహిళల టీమ్. ఇక పురుషుల్లో అయితే 443 పరుగులతో ఇంగ్లండ్ జట్టు ఇప్పటివరకూ హైయస్ట్ స్కోర్ గా నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates