మహిళల హాకీ ప్రపంచకప్‌: నాకౌట్‌లో భారత్

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత నాకౌట్‌లోకి దూసుకెళ్లింది. టోర్నీలో నిలువాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం(జూలై-29) అమెరికాతో జరిగిన పూల్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌ను టీమ్‌ఇండియా 1-1తో డ్రా చేసుకుంది. తమ కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న అమెరికాకు భారత్ ధీటుగా నిలిచింది. అమెరికా తరపున పౌలిన్హో మార్గక్స్ గోల్ చేయగా, కెప్టెన్ రాణి రాంపాల్ భారత్‌కు ఏకైక గోల్ అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్ క్రాస్‌ఓవర్ పోరులో నిలిచింది. నాలుగు గ్రూపుల నుంచి టాప్‌లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, మిగిలిన స్థానాల కోసం జట్ల మధ్య పోటీ ఏర్పడింది.

మొదటి క్వార్టర్ 11వ నిమిషంలో భారత గోల్‌కీపర్ నుంచి వచ్చిన రీబౌండ్ షాట్‌ను మార్గక్స్ గోల్‌గా మలువడంతో అమెరికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనేక సార్లుపెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా..భారత డ్రాగ్‌ఫ్లికర్ గుర్జీత్‌కౌర్ గోల్‌గా మలువలేకపోయింది. మ్యాచ్ 31వ నిమిషంలో రాణి పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేయడంతో స్కోరు 1-1తో డ్రాగా ముగిసింది. చివర్లో రెండు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాయి.

Posted in Uncategorized

Latest Updates