మహిళల హాకీ ప్రపంచకప్‌: భారత్ vs అమెరికా

ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసి బోల్తా కొట్టిన భారత్‌కు ఇవాళ (ఆదివారం,జూలై-29) జరగబోయే మ్యా చ్‌ కీలకంగా మారింది. గ్రూప్‌-బి నుంచి నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఓటమిని తప్పించుకోవాలి. అమెరికాతో జరిగే మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాలి. గెలిస్తే మరీ మంచిది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచే అవకాశం ఉన్నా… పట్టునిలుపుకోలేక డ్రా చేసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి సంక్లిష్టంగా మారింది. సెకండ్‌ రౌండ్‌ రాబిన్‌లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో గేమ్‌లో ఏడు పెనాల్టిలను వృధా చేసుకన్న రాంపాల్‌ టీం.. చివరకు 0-1తో ఓటమిపాలైంది. ఐర్లాండ్‌పై గెలిచివుంటే నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరేది. ఇండియా ఉన్న గ్రూప్‌-బి జట్లలో అమెరికా, ఐర్లాండ్‌, భారత్‌ ఒక డ్రా.. ఒక ఓటమితో ఒక్కో పాయింట్‌తో సమానంగా ఉన్నాయి. అయితే, ఒక గోల్‌ ఆధిక్యంలో ఉంది. దీంతో ఇండియా క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే ఆదివారం మ్యాచ్‌లో నెగ్గాలి లేదంటే డ్రా చేసుకోవాలి.

Posted in Uncategorized

Latest Updates