మహిళల 100 మీటర్ల రేసు : ద్యుతీచంద్‌కు స్వర్ణం

chand భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ మళ్లీ మెరిసింది. మంగళవారం (ఫిబ్రవరి-27)న పటియాలలో జరిగిన సీజన్ తొలి టోర్నీ ఇండియన్ గ్రాండ్‌ప్రీ మహిళల 100మీ రేసును 11.57 సెకన్లలో ముగించి గోల్డ్ మెడల్ సాధించింది. హిమదాస్(11.74 సె), రజీనా ప్రకాశ్(11.76సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 100మీటర్ల రేసులో రాష్ర్టానికి చెందిన సుధాకర్ యాదవ్(10.71 సె) కాంస్య పతకంతో ఆకట్టుకున్నాడు. ఇదే పోటీలో విద్యసాగర్(10.65సె), అనురూప్ జాన్(10.70సె) స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా 82.88 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకంతో సత్తాచాటాడు. ఇదే పోటీలో విపిన్ కసాన(80.04మీ) రజతం దక్కించుకోగా, అమిత్‌కుమార్(77.33మీ) కాంస్య పతకం సాధించాడు. దాదాపు మూడు నెలల తర్వాత బరిలోకి దిగిన నీరజ్..ప్రత్యర్థులను అలవోకగా అధిగమిస్తూ టాప్‌లో నిలిచాడు.

ప్రస్తుతం ద్యుతీచంద్‌ తెలంగాణకు చెందిన కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఇదే మీట్‌లో పురుషుల జావెలిన్‌ త్రోలో ఆసియా చాంపియన్‌ నీరజ్‌ చోప్రా పసిడి పతకం గెలిచాడు. అతను జావెలిన్‌ను 82.88 మీటర్ల దూరం విసిరాడు.

Posted in Uncategorized

Latest Updates