మహిళా పోలీసులు రోల్ మోడల్స్ కావాలి.. సీపీ

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా పోలీస్ ల సంఖ్య పెరిగిందన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్.  ప్రతీ రోజు పోలీస్ స్టేషన్లకు వస్తున్న కేసుల్లో 60శాతం మహిళలపై వేధింపుల కేసులే ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులను తగ్గించేందుకు సమాజంలో మరింత అవగాహన రావాలన్నారు. గత 10 ఏళ్ళతో పోల్చితే డిపార్టుమెంట్ లో మహిళా ప్రాధాన్యత పెరిగిందన్నారు. విధి నిర్వహణలో మెన్, ఉమెన్ పోలీస్ తేడాలు ఉండవన్నారు. హనుమాన్ జయంతి, గణేష్ నిమజ్జనంతో పాటు లా అండ్ ఆర్డర్ బందోబస్తులో మహిళా పోలీసులు సక్సెస్ అయ్యారన్న అంజనీకుమార్.. పోలీసింగ్ లో మహిళా పోలీసులు రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు.

ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో  అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో సీపీ ఈ కామెంట్స్ చేశారు. బాలికల దినోత్సవం వేడుకలను షీ టీమ్స్, భరోసా సెంటర్ పోలీసులు నిర్వహించారు. సీపీ అంజనీ కుమార్, అడిషనల్ సీపీ షికా గోయల్, మహిళా ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.

సిటీలో 1300 మంది మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారని.. అందరూ మేల్ కానిస్టేబుల్స్ తో పోటీ పడి పనిచేయాలన్నారు అదనపు సీపీ షికా గోయల్. సిటీలో మహిళా రక్షణలో ఉమెన్ పోలీసులు ముందుండాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates