మహిళా రక్షణ కోసం సఖి వెబ్ సైట్ : మహేందర్ రెడ్డి

మహిళా రక్షణ కోసమే సఖి వెబ్ సైట్ ను తీసుకువచ్చినట్లు చెప్పారు మంత్రి మహేందర్ రెడ్డి. ఆదివారం (జూలై-22) హైదరాబాద్ లోని వనస్థలిపురం సఖి సెంటర్‌ లో సఖి వెబ్‌ సైట్‌ ను ప్రారంభించారు మహేందర్ రెడ్డి. మహిళలు తమ సమస్యలను సఖి వెబ్‌ సైట్ ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.
సలహా, సాంత్వన, రక్షణ అనే లక్ష్యాలతోపాటు కౌన్సిలింగ్, న్యాయ సేవలు/కేసు నమోదు, పోలీస్ సహా యం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి, వీడియోకాన్ఫరెన్స్ సేవలు అందించబ‌డతాయి. కౌన్సిలింగ్ చేయుటకు మానసిక, సామాజిక కౌన్సిలర్ల ద్వారా సహాయం అం దించనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్ ద్వారా ప్రభుత్వం మహిళలకు అన్ని రకాల సేవలను అందించనున్నది. స్త్రీలు ఎదుర్కొనే వేధింపులు, దాడులు, గృహహింస, వరకట్న సమస్యలు, అక్రమ రవాణా, ఈవ్‌టీజీంగ్‌లు, లైంగికదాడులు వంటి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈసేవలను ప్రవేశపెట్టింది.

Posted in Uncategorized

Latest Updates