మహిళ అని కూడా చూడలేదు : టీమిండియా క్రికెటర్ భార్యపై కానిస్టేబుల్ దాడి

Ravindra-Jadeja-wifeఎవరైతే ఏంటీ.. తప్పుచేస్తే అందరికీ ఒకే శిక్ష.. ఇందులో అనుమానం లేదు. చిన్న తప్పులోని పశ్చాత్తాపం ఉందా లేదా అనేది కూడా ముఖ్యం. ఇలాంటి విచక్షణ లేకుండా ఓ కానిస్టేబుల్ మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఆ మహిళ వివరణ ఇచ్చేలోగానే విచక్షణారహితంగా వ్యవహరించాడు. అందులోనూ ఆ మహిళా క్రికెట్ జడేజా భార్య రీవా కావటంతో ఇప్పుడు ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా టాప్ స్పిన్నర్ జడేజా భార్య రీవా గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ లో కారులో ప్రయాణిస్తున్నారు. తన BMW కారులో షాపింగ్ కోసం అని జామ్ నగర్ మార్కెటింగ్ ఏరియాకి వచ్చారు. అదే సమయంలో రాంగ్ రూట్ లో.. పల్సర్ బైక్ పై సంజయ్ అహిర్ అనే కానిస్టేబుల్ వచ్చాడు. రాంగ్ రూట్ లో వచ్చిన కానిస్టేబుల్ బైక్ కు.. సరైన రూట్ లో వెళుతున్న జడేజా భార్య రీవా సోలంకి కారు తగింది. ఇందులో రీవా తప్పులేదు. అయినా వెంటనే కారు దిగి.. కానిస్టేబుల్ ను పరామర్శించారు. దెబ్బలు తగిలాయా అని దగ్గరకి వెళ్లి చూశారు. యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్.. అందులోనూ రాంగ్ రూట్ లో వచ్చాడు.. సైలెంట్ గా వెళ్లాల్సింది పోయి.. మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. నడిరోడ్డుపై చుట్టుపట్టుకుని మరీ ఈడ్చివేశాడు.

కానిస్టేబుల్ సంజయ్ అహిర్.. నడిరోడ్డుపై ఓ మహిళ జుట్టు పట్టుకుని కొట్టబోతుండటం చూసిన చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి సర్దిచెప్పారు. నడిరోడ్డుపై ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వైఖరిని జామ్ నగర్ ఎస్పీ ప్రదీప్ కు కంప్లయింట్ చేసింది జడేజా భార్య రీవా. ఆ వెంటనే ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. రీవాను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. విచారణ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ పై కంప్లయింట్ చేయించారు. ఆ వెంటనే స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ సార్ ను.. అరెస్ట్ చేశారు. మహిళపై దాడి కేసు తీవ్రమైనది అని.. FIR తర్వాత చార్జిషీట్ వేస్తామని ఎస్పీ ప్రదీప్ వెళ్లడించారు. క్రికెటర్ భార్య అని కాకుండా ఓ మహిళపై నడిరోడ్డుపై దాడి అనే అంశం కూడా తీవ్రమైనదిగా చెప్పుకొచ్చారు ఎస్పీ..

Posted in Uncategorized

Latest Updates