మహిళ ప్రాణం తీసిన అజాగ్రత్త

sareeeeఅజాగ్రత్త ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. నడుస్తున్న బైక్‌ వెనక చక్రంలో చీర చిక్కుకోవడంతో, కిందపడి ఓ మహిళ మృతి చెందారు. ఈ సంఘటన కర్ణాటకలోని సింగారపేటలో జరిగింది. వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన రాము, మీన(23) దంపతులు శనివారం(ఫిబ్రవరి-3) క్రిష్ణగిరి జిల్లా సింగారపేటకు బైక్ పై వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గిడ్డంబట్టి దగ్గర వెనుక చక్రంలో చీర కొంగు చిక్కుకుంది. దీంతో ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. వీరిని సేలం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మీనా మృతి చెందారు. ఘటనపై సింగారపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates