మహేష్, సచిన్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో హరిత సవాల్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను  స్వీకరించిన మంత్రి కేటీఆర్… టీ-సాట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిన్న( గురువారం, జూలై-26) మూడు మొక్కలు నాటారు. తర్వాత మరో ఐదుగురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. సినీనటుడు మహేష్ బాబు, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి హరిత సవాల్ విసిరారు. మూడు మొక్కల చొప్పున నాటాలన్నారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates